స్టార్ డైరెక్టర్‌తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా? | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: లియో డైరెక్టర్‌తో శృతిహాసన్.. ఈ కాంబో సెట్ అయ్యేనా?

Published Thu, Feb 8 2024 3:15 PM

Kollywood Actress Shruthi Haasan Works With Famous Director - Sakshi

కోలీవుడ్ భామ శృతిహాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌ సెట్‌ అయిందా? ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్‌. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. 

అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు.  ఆ తరువాత ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్‌–2 చిత్రాలు చేయాల్సి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కలిసి ఉన్న పోస్టర్‌ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్‌ ఇదువే ఉరువు, ఇదువే సూల్‌ నిల్‌ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై శ్రుతిహాసన్‌తో దర్శకుడు లోకేష్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement