పెద్ది ఐటమ్ సాంగ్.. శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్..! | kollywood actress Shruthi Haasan Remunaration for peddi item song | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: పెద్ది ఐటమ్ సాంగ్.. ఒక్క పాటకే అన్ని కోట్లా?

Apr 26 2026 3:48 PM | Updated on Apr 26 2026 4:07 PM

kollywood actress Shruthi Haasan Remunaration for peddi item song

రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్‌ కోసం పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.

ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్‌పై టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్‌పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్‌కు పోస్ట్‌పోన్ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement