ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది: కిరణ్‌ | Kiran Abbavaram Confident Speech at Chennai Love Story Song Launch | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది: కిరణ్‌

Mar 31 2026 3:17 AM | Updated on Mar 31 2026 3:17 AM

Kiran Abbavaram Confident Speech at Chennai Love Story Song Launch

శ్రీగౌరి ప్రియ, కిరణ్, మణిశర్మ

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘చెన్నై లవ్‌ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయిరాజేశ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘గుర్తుందా...’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాను డాల్బీ ఫార్మాట్‌లో చేస్తుండటం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఈ సినిమా కోసం ఏడు పాటలను కంపోజ్‌ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.

‘‘ఈ మూవీ డిస్కషన్స్ లో బ్రహ్మాండమైన ట్యూన్స్  కుదిరాయి’’ అని చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ.‘‘ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్‌ చేస్తున్నాం. మణిశర్మగారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు రవి నంబూరి. ‘‘బేబీ’ సినిమాను ఐదు గంటలు తీశాను. కానీ, ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా నిడివిని కుదించడంలో రవి నంబూరి నాకు హెల్ప్‌ చేశాడు. సినిమాలో కొంత భాగం చూసి, కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేను ప్రోడ్యూసర్‌గా మణిశర్మగారితో సినిమా చేయడం కంటే ఇంకేం కోరుకోను’’ అన్నారు సాయిరాజేష్‌.

‘‘ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం అని చెప్పినప్పుడు అల్లుఅర్జున్ గారు కూడా ప్రోత్సహించారు’’ అన్నారు ఎస్‌కేఎన్ . ‘‘బేబి’ సినిమా కంటే పదిరెట్ల విజయాన్ని ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా సాధిస్తుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు ఈ చిత్ర సహ–నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. హీరోయిన్  శ్రీగౌరి ప్రియ,  కెమెరామేన్‌ విశ్వాస్‌ డేనియల్, ఎడిటర్స్‌ సంతోష్‌ నాయుడు, విప్లవ్, నటుడు మహేందర్,    లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్, కొరియోగ్రాఫర్‌ విజయ్‌ పొలాకీ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement