Boxoffice Battle: KGF Chapter 2 VS Beast VS Jersey | Who Will Win? - Sakshi
Sakshi News home page

Box Office Battle: రాఖీభాయ్‌తో విజయ్‌, షాహిద్‌ ఢీ.. ఏప్రిల్‌ 14న ఏం జరగబోతోంది?

Apr 7 2022 11:16 AM | Updated on Apr 7 2022 1:19 PM

KGF Chapter 2 VS Beast VS Jersey: Who WIll Win In Boxoffice Battle - Sakshi

ఏప్రిల్ 14న తుపాన్ వేగంతో వస్తున్నాడు రాఖీభాయ్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్‌ అభిమానులను అదే రోజు పలకరించనున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పడం.. అందుకు తగ్గట్టే టీజర్‌, ట్రైలర్‌ , సాంగ్స్‌ ఉండడంతో కేజీఎఫ్‌2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే రాఖీభాయ్‌ని ఢీ కొట్టేందుకు ఇటు విజయ్‌, అటు షాహిద్‌ కపూర్‌ రెడీ అవుతున్నారు.

కేజీఎఫ్‌ 2 విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే ఏప్రిల్‌ 13న విజయ్‌ కొత్త చిత్రం ‘బీస్ట్‌’ థియేటర్స్‌లోకి రాబోతుంది. పాన్‌ ఇండియా వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాడు విజయ్‌. ఈ చిత్రంలోని ‘అరబిక్‌ కత్త’సాంగ్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా బంపర్‌ హిట్‌ కొట్టడంతో రాఖీభాయ్‌ వసూళ్లకు బీస్ట్‌ పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరో వైపు బాలీవుడ్ లో రాఖీభాయ్ స్పీడ్ కు గట్టిగానే బ్రేకులు వేస్తానంటున్నాడు షాహిద్‌ కపూర్‌. గతంలో నాని నటించిన సూపర్ హిట్ ఫిల్మ్, అతని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్.తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఇంకాస్త బెటర్ గా, బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించే విధంగా తెరకెక్కించాడు.రీసెంట్ గా రిలీజైన న్యూ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేస్తోంది. కేజీఎఫ్‌ 2 రిలీజ్ అవుతున్న రోజే(ఏప్రిల్‌ 14) జెర్సీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది.కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కనిపిస్తున్న  సినిమా కావడంతో, కేజీఎఫ్‌ 2 కలెక్షన్స్ కు ఈ చిత్రం కూడా కొంత కోత పెట్టే అవకాశాలు బాగానే ఉన్నాయి.

చదవండి: ఆన్సర్‌ షీట్‌లో 'పుష్ప' డైలాగ్స్‌ రాసిన టెన్త్‌ స్టూడెంట్‌

విజయ్ బీస్ట్ గా మారినా,షాహిద్ కపూర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినా తాను సృష్టించే విధ్వంసం ముందు తక్కువే అంటున్నాడు రాఖీభాయ్.ప్రశాంత్ నీల్ లాంటి మెగా మేకర్ అండతో,కనివిని ఎరుగని వయలెన్స్ తో కేజీఎఫ్‌ 2 ఆడియెన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తోందనే నమ్మకంగా ఉన్నాడు హీరో యశ్. పైగా అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తుండటం తనకు అదనపు బలంగా చెప్పుకొస్తున్నాడు రాఖీభాయ్. మరి ఈ బాక్సాఫీస్‌ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement