Karthika Deepam Today Episode June 5th: మోనితపై కార్తీక్‌ ఫైర్‌, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది - Sakshi
Sakshi News home page

karthika Deepam: మోనితపై కార్తీక్‌ ఫైర్‌, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది..

Published Sat, Jun 5 2021 2:23 PM

Karthika Deepam Serial: Karthika Lashes Out Monitha After She Said Pregnant - Sakshi

కార్తీకదీపం జూన్‌ 5: కార్తీక్‌ దీప కాళ్లు పట్టుకుని, నిజం చేప్పేలోపే మోనిత వచ్చి కథ అంతా మారుస్తుంది. తాను గర్భవతిని అని దీవించండి అంటూ సౌందర్యతో అంటుంది. అది విన్న వారంత ఒక్కసారిగా షాక్‌ అవుతారు. మరీ మోనిత చెప్పింది నమ్ముతారా! మరీ దీప ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నదనేది నేటి(శనివారం) ఎపిసోడ్‌ ఇక్కడ చదవండి..

నేను నెల తప్పాను ఆంటీ అని చెప్పగానే సౌందర్య కోపంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్’ అంటుంది ఆవేశంగా. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అంటుంది మోనిత. దాంతో అంతా షాక్ అవుతారు. వెంటనే కార్తీక్ కోపంగా ‘స్టాపిట్‌ మోనితా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి అమ్మా దీపా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవని పేరంటంలా వచ్చేస్తావ్.. రసాబస చెయ్యాలని చూస్తావ్.. నువ్వు నా ఫ్రెండ్‌వా శత్రువ్వా.. ఎందుకింత దారణంగా మాట్లాడుతున్నావ్?’ అంటాడు ఆవేశంతో ఊగిపోతూ.

వెంటనే మోనిత నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటు ఎమోషనల్‌ డ్రామా ప్లే చేస్తుంది. అందరిని నమ్మించేందుకు కార్తీక్‌ పురషాహంకారం చూపించుకుంటున్నావా ఆడదంటే అంత అలుసా? ప్రెగ్నెంట్ అని అబద్దం చెబుతున్నా అనుకుంటే అది దాస్తే దాగే విషయమా? అంటుంది. పోనీ నా ప్రెగ్నెన్సీకి నువ్వు కారణం కాదంటావా? రేపు డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బటయపడుతుంది కదా.. ఏ ఆడదైనా ఈ విషయంలో అబద్దం చెబుతుందా కార్తీక్.. ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం. నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్ కార్తీక్.. అది అబద్దం అని ఇవాళ నా వల్ల నిర్ధారణ అయ్యింది’ అంటుంది మోనిత.

దీప బాధగా తలవంచి నిలబడగా.. మోనిత దీపని చూసి లోలోపల నవ్వుకుంటూ దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ‘నన్ను క్షమించు దీప కార్తీక్ నీ విషయంలో తప్పు జరిగిందని గట్టిగా నమ్మేసరికి.. ఒక ఫ్రెండ్‌గా అతడ్ని సపోర్ట్ చేశాను.. సాటి ఆడదానిగా నీకు అన్యాయం చేశాను.. నువ్వు కళంకితవు కాదు.. పరమ పవిత్రురాలు.. కార్తీక్ ఒక్క క్షణం కాదంటేనే నేను భరించలేకపోయాను. నువ్వు 10 ఏళ్ల పాటు ఈ నింద నువ్వు ఎలా తట్టుకున్నావో ఎలా మోశావో ఊహిచడం నావల్ల కాదు. నువ్వు చాలా గ్రేట్ దీపా హ్యాట్సాప్ టు యూ’ అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక సౌందర్య వైపు తిరుగుతుంది. ‘మీరు చాలా మంచివారు ఆంటీ.. కొడుకు మాట కూడా నమ్మకుండా కోడలికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిత్వం మీది.. నేను ఆడపిల్లనే నాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే ఆలోచించి మీ అబ్బాయికి చెప్పండి.. ఇంకా మీకు ఎవరికీ నమ్మకం కుదురకపోతే.. ఇదిగో నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్’ అని దేవుడు దగ్గర పెట్టి వెళ్లిపోతుంది.

మోనిత వెళ్లిపోగానే మురళీ కృష్ణ పెద్దగా నవ్వుతూ.. ‘దీన్ని ఏం అంటారు? మోసమా? కుట్రనా నయవంచనా? ఇంత దారుణమా.. ఇంత నీచత్వమా? ఎలాగో నాకు పిల్లలు పుట్టరనే సాకుతో ఇలా ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు ఆవిడ వల్ల ఈ నిజం బయటపడింది.. బయటపడని బాగోతాలు ఎన్నో? ఇంకెంత మంది అభాగ్యులు ఉన్నారో మీ లిస్ట్‌లో? అంటూ కార్తీక్‌ని ప్రశ్నిస్తాడు.  ‘మురళీ కృష్ణ గారు..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఆపవయ్యా.. ఆయనకి మూడ్ వస్తే మావయ్యా అంటాడు.. కోపమొస్తే మురళీ కృష్ణా అంటాడు.. మావయ్యా అంటే మురిసిపోవాలి.. నోరుమూసుకుని పోవాలంటే పోవాలి.. ఎందుకంటే దీనికి పెళ్లి ముందు నాకు పిల్లలు పుట్టరు.. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి అభ్యంతరం లేదంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇతడిలోని నిజాయితీకి మురిసిపోయాను’ అంటూ మురళీ కృష్ణ ఏడుస్తూ అంటుంటే కార్తీక్ తలదించుకుంటాడు.

దీప బొమ్మలా నిలబడి ఉంటుంది. ‘ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా.. పిల్లలు పుట్టకపోతే ఏంటిలే దత్తత తీసుకుంటారులే అనుకుని, నా కూతురు ఇంతటి వాడ్ని మిస్ అయిపోకూడదని.. ఆ విషయం నా కూతురుకి కూడా చెప్పకుండా పెళ్లి చేశాను.. వరమో శాపమో దీని కడుపు పండింది. అప్పటి నుంచి దీపను చేడిపోయావంటు కార్తీక్‌ అవమానించిన రోజులను గుర్తు చేస్తూ కార్తీక్‌పై అసహనం వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ట. ఇక వెంటనే సౌందర్య వైపు తిరిగి.. ‘చెయ్యని తప్పుకుని ఇన్నేళ్లు నరకం చూపించిన నీ కొడుక్కి ఎలాంటి శిక్ష వేస్తావమ్మా.. నీ కొడుకు వల్ల జీవితమే నాశనం అయిన నా కూతురికి ఏం న్యాయం చేస్తావమ్మా? అని అడుగుతాడు. దీపతో నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపం, అంతకన్నా ఏం లేదమ్మా.. పదమ్మా వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోదాం అనడంతో దీప కార్తీక్ వైపు చూస్తుంది. ఆ తర్వాత దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, నెక్ట్‌ మోనిత వేసే ప్లాన్‌ ఏంటో సోమవారం నాటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Advertisement
 
Advertisement
 
Advertisement