ఏదైనా దీవిలో ఇరుక్కుపోయామా అని భయమేస్తోంది అమ్మ: హిమా | Sakshi
Sakshi News home page

ఆ గీతలు చెరిపే శక్తి దీపకు మాత్రమే ఉందని ​కార్తీక్‌తో చెప్పిన సౌందర్య

Published Tue, Jun 22 2021 3:20 PM

Karthika Deepam Serial: Bhagyam Advice To Soundarya To Warn Monitha - Sakshi

కార్తీకదీపం జూన్‌ 22 ఎపిపోడ్‌: కార్తీక్‌ దీప ఇంటి ముందు జనత ఉచిత వైద్యశాల పేరుతో క్టీనిక్‌ నడుపుతున్న విషయం తెలిసిందే. కార్తీక్‌ పేషెంట్స్‌ను చూస్తుండగా సరోజక్క మరిది లక్ష్మణ్‌ వస్తాడు. కార్తీక్‌ అతడి రిపోర్ట్స్‌ చూసి మందులు రాసి ఇస్తాడు. అంతేగాక తన దగ్గర పని చేయాలని అందుకు తనకు రూ. 25 వేల జీతం ఇస్తానని కార్తీక్‌ చెప్పడంతో లక్ష్మణ్‌ ఎమోషనల్‌ అవుతాడు. కార్తీక్‌ దేవుడు అంటూ పొగుడుతుండగా సరిగ్గా అదే సమయానికి దీప బయటకు వస్తుంది. 

లక్ష్మణ్‌ దీపను చూసి దీపమ్మా ఇలా రమ్మా అంటూ పిలిచి వారిద్దరి కాళ్లకు దండం పెట్టుకుంటాడు. మీరిద్దరూ ఆదర్శ దంపతులంటూ మీలో రాముడు, సీత.. శివుడు, పార్వతిలు కనిపిస్తున్నారంటాడు. దీంతో కార్తీక్ ‘ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్న ఈ మనిషి లోపల ఎంత దుర్మార్గుడో వీళ్లకేం తెలుసు అనుకుంటున్నావా దీపా’ అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే హిమ బయటికి వచ్చి అమ్మా వెళ్దామా అంటుంది. కార్తీక్ ఎక్కడికి అనడంతో మార్కెట్‌కు వెళ్తున్నామని చెబుతుంది దీప. 

ఇదిలా ఉండగా భాగ్యం సౌందర్యతో రహస్యంగా మాట్లాడుతుంది. మోనితకు ఇలా సాఫ్ట్‌గా చెబితే పని జరగదని, తను వెళ్లి తన తీరులో మోనితకు వార్నింగ్‌ ఇస్తానని చెబుతుంది భాగ్యం. లేదంటే మీరైనా క్లాసుగా కాకుండా మాస్‌గా వార్నింగ్ ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది. అది జరగని పని.. మన దగ్గర తప్పు పెట్టుకుని మోనితని ఏం చేయలేమని సౌందర్య అంటుంది. అంతేగాక తన దగ్గర ఇప్పుడు బ్రహ్మస్త్రం ఉందని ఇప్పుడు మోనిత భయపెట్టడం జరగదంటుంది. కానీ భాగ్యం మాత్రం మనసైడు తప్పు ఉన్న తల వంచకుండా తెలివిగా ఆలోచించి మోనిత పని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

మరోవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని.. గోడపై మోనిత గీసిన గీతలని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండగా లోపల నుంచి శౌర్య వస్తుంది.  కార్తీక్‌ ఆ గీతలను చూస్తుండటం చూసి అవి నీ భవిష్యత్తు అన్నావు కదా నాన్న ఇప్పుడు వాటి వల్ల ఎమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమాయకంగా. అప్పుడే కార్తీక్‌కు అన్ని గుర్తు చేసుకుంటాడు. దీప ప్రెగ్నెట్‌ అని తెలియగానే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని గట్టిగా అరిచి చెప్పిన సంఘటన, అలాగే శౌర్య గతంలో నాన్న పిలిచి నువ్వే మా నాన్నవని ఎప్పుడో తెలుసు అనడం, కార్తీక్‌ హిమని ఎత్తుకుని తిరిగింది అన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్‌ అవుతాడు. దీంతో శౌర్యను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని తీప్పుతుండగా అప్పుడే సౌందర్య వస్తుంది. అదంతా చూసి ఆనందిస్తుంది. 

ఇంతలో కార్తీక్‌ సౌందర్య చూసి నానమ్మ వచ్చిందని చెప్పగానే శౌర్య సంతోషిస్తుంది. లోపలికి వచ్చిన సౌందర్య గోడ మీద ఉన్న గీతలను చూసి శౌర్యతో గ్లాసులో నీళ్లు తెమ్మని చెబుతుంది. ఆ లోపు కార్తీక్‌తో ఆ గీతల్ని చెరపకుండా అలేనే ఉంచుతావా అని ప్రశ్నిస్తుంది. అయినా కార్తీక్ మౌనంగా ఉంటాడు. ‘ఆ గీతల్ని చెరిపి నీ రాతను మార్చుకోరా’ అంటుంది అనడంతో తన వల్ల కాదేమో మమ్మీ అంటాడు కార్తీక్ నిరాశగా.. ఆ మోనిత నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని, తనని బెదరిస్తుంది కానీ దీపకు భయపడుతుంది అంటుంది. అందుకే. సమస్యని దీపకు చెప్పు.. దీప చేతిలో పెట్టు.. ఆ గీతల్ని దీపే చెరిపేస్తుంది అని సౌందర్య చెబుతుంది. దీంతో ఆ కార్తీక్‌ దీప చూసే చూపుల్లో ఆ గీతల్ని చెరిపే బాధ్యత నీదే అన్నట్టు నాకు అర్థమవుతుంది మమ్మీ.. ఇంకా ఆ గీతల్ని ఎలా చెరిపేస్తుంది అంటాడు కార్తీక్‌. 

మరోవైపు ఆటో వస్తుండగా హిమ దీపతో వారణాసి ఎందుకు రాలేదని, ఫోన్‌ చేస్తే ఎందుకు కట్‌ చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. దీంతో ఏదో పని మీద బయటకు వెళ్లాడని దీప సమధానం ఇస్తుంది. ఆ తర్వాత హిమ నాకు చాలా భయంగా ఉందని, ఏదో మనసులో తెలియని బాధ ఉంటోందంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనం అందరం కలిసే ఉన్నా ఏంటో​ భయం భయంగా అనిపిస్తుందంటూ బాధపడుతుంది. వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే.. ఇక మీదట వారణాసి కూడా మనతో మాట్లాడడేమోననే భయమేస్తోందని, ఈ ప్రపంచంలో మనషులంతా వేరు, మన నలుగురం వేరేమో.. ఏదైనా దివిలో ఇరుక్కుపోయామోనని అనిపిస్తుంది అమ్మ అంటూ హిమ కన్నీరు పెట్టుకోవడంతో దీప హిమను దగ్గరకు తీసుకుని తాను కూడా ఎమోషనల్‌ అవుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement