కార్తీ మార్షల్‌ | Karthi upcoming film with director Tamizh titled Marshal | Sakshi
Sakshi News home page

కార్తీ మార్షల్‌

Jul 11 2025 12:20 AM | Updated on Jul 11 2025 12:20 AM

Karthi upcoming film with director Tamizh titled Marshal

హీరో కార్తీ ‘మార్షల్‌’ ప్రయాణం మొదలైంది. కార్తీ హీరోగా ‘తానాక్కారన్‌’ ఫేమ్‌ తమిళ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘మార్షల్‌’ టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్‌ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్‌ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాయి అభ్యంకర్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘‘అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో ‘మార్షల్‌’ సినిమాను నిర్మించనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా ప్రధానంగా తీరప్రాంతం, సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement