
శ్రీ చరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా నటించిన రూరల్ లవ్‌స్టోరీ ‘కన్యాకుమారి’. ‘అన్‌ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. నటి మధు షాలిని సమర్పణలో సృజన్ అట్టాడ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో సహజ వాతావరణంలో నడిచే కథ ఇది. ఈ సహజమైన కథ సినిమాటిక్ టచ్‌తో కొత్త ఫీల్ కలిగించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి.