రజనీకాంత్‌ దేవుడంటోన్న కన్నడ స్టార్‌ యశ్‌‌

Kamal Haasan Is Bhagavad Gita, Rajinikanth Is God: Yash - Sakshi

కన్నడ స్టార్ హీరో యశ్‌ కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దాదాపు రూ.360 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలో దాని సీక్వెల్‌గా వస్తోన్న కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 16న సినిమా రిలీజ్‌ కానుండటంతో ప్రమోషన్లు మొదలు పెట్టారు చిత్రయూనిట్‌ సభ్యులు. ఇందులో భాగంగా యశ్‌ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బడా హీరోలు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, షారుఖ్‌ ఖాన్‌ గురించి ఒక్కమాటలో చెప్పాడు.

"కమల్‌ సర్‌ నటన భగవద్గీత, రజనీకాంత్‌ దేవుడు.. ఆయన మా తలైవా, షారుఖ్‌ ఖాన్‌ అపర మేధావి, అందరికీ ప్రేరణ" అని చెప్పుకొచ్చాడు. స్టార్‌ హీరోల పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ యశ్‌ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి స్వభావానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక బాలీవుడ్‌లో ఎవరితో కలిసి నటించాలని ఉందన్న ప్రశ్నకు నవాజుద్దీన్‌ సిద్దిఖీ అని టపీమని బదులిచ్చాడీ స్టార్‌.

చదవండి: అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్‌ హాసన్‌

వైరల్‌: విలాసవంతమైన యశ్‌ ఇల్లు చూసేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top