అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్‌ | Sakshi
Sakshi News home page

Kamal Haasan Indian 2 Movie: 'భారతీయుడు 2' సినిమాపై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published Sat, Jun 4 2022 11:55 AM

Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie - Sakshi

Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్‌) కమల్‌ హాసన్‌ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌' మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమల్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్‌ 2) గురించి మాట్లాడారు. శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్‌ స్పందనను యాంకర్‌ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 

భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్‌లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్‌ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్‌ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్‌. ప్రొడక్షన్స్‌ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. 

చదవండి: కమల్‌ హాసన్‌: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ..
కమల్‌ హాసన్‌ 'విక్రమ్' మూవీ ట్విటర్‌ రివ్యూ..

Advertisement
 
Advertisement
 
Advertisement