ఈ ఏడాది పెద్ది మూవీతో టాలీవుడ్ అభిమానులను అలరించిన బ్యూటీ జాన్వీ కపూర్. ఈ బీటౌన్ ముద్దుగుమ్మ.. రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా ఆకట్టుకుంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో బిజీగా ఉంది.
తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది జాన్వీ. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా తనలోని టాలెంట్‌ను బయటపెట్టింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు చూపించని టాలెంట్‌ను అభిమానులకు పరిచయం చేసింది. తనలో దాగి ఉన్న ఈ విచిత్రమైన టాలెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేసింది.
ఆమెను హిడెన్ టాలెంట్ ఏంటని అడగ్గా.. 'నా నాలుకను 360 డిగ్రీలు తిప్పగలను. అయితే ఇది పెద్దగా ఉపయోగపడని టాలెంట్.. అంటూ జాన్వీ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ ట్రిక్‌ను తాను స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకున్నానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ఈ టాలెంట్ చూసిన నెటిజన్లు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం టాలెంట్? దీనికంటే యాక్టింగ్‌పై ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెను సరదా కోసమే అలా చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
జాన్వీ ‘హిడెన్ టాలెంట్’.. నెటిజన్ల ట్రోలింగ్. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. తనలో దాగి ఉన్న ఓ విచిత్రమైన టాలెంట్ గురించి చెప్పి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తన హిడెన్ టాలెంట్ ఏంటని అడగ్గా.. “నా నాలుకను 360 డిగ్రీలు తిప్పగలను. అయితే ఇది పెద్దగా ఉపయోగపడని టాలెంట్” అంటూ జాన్వీ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ ట్రిక్‌ను తాను స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకున్నానని వెల్లడించారు. అయితే జాన్వీ చెప్పిన ఈ ‘టాలెంట్’పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “ఇదేం టాలెంట్?”, “దీనికంటే యాక్టింగ్‌పై ఫోకస్ చేస్తే బాగుంటుంది”, “నెపో కిడ్స్‌కు ఇవే టాలెంట్స్” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమెను సరదాగా ట్రోల్ చేస్తున్నారు. #JanhviKapoor #Bollywood #ViralNews #ViralVideo #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/pRwfY32ELk
— Tupaki (@tupaki_official) October 7, 2026


