ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్ | Jai Akash Comments On Stop Directing His New Movies | Sakshi
Sakshi News home page

ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్

Feb 17 2024 2:51 PM | Updated on Feb 17 2024 4:24 PM

 Jai Akash Comments On Stop Directing His New Movies - Sakshi

'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత  కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్‌కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. 

(ఇదీ చదవండి: కాంగ్రెస్‌ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?)

అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్‌ మూవీస్‌' అనే యాప్‌ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా..  చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. 

తాను నటించిన 'అమైచర్‌ రిటర్న్‌', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement