Actress Taapsee Reveals About Her Wedding Plans And Makeup, Deets Inside - Sakshi
Sakshi News home page

Taapsee Pannu: అలాంటి పెళ్లికూతుళ్లను చూస్తే బాధగా ఉంటుంది

Apr 5 2022 8:15 AM | Updated on Apr 5 2022 9:14 AM

I Want A Simple Wedding Without Makeup Taapsee Pannu Says - Sakshi

‘‘సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వ్యక్తితో నాకు అనుబంధం కుదరాలని కోరుకున్నాను. కెరీర్‌ ఆరంభించిన తక్కువ టైమ్‌లోనే అది జరిగింది. నాకెవరితో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో అలాంటి వ్యక్తే దొరకడం ఆనందంగా ఉంది’’ అంటున్నారు తాప్సీ. డెన్మార్క్‌ బ్యాడ్‌మింటన్‌ క్రీడాకారుడు మథియాస్‌ బోతో తాప్సీ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మథియాస్‌తో అనుబంధం గురించి ఓ పత్రిక అడిగితే.. పై విధంగా స్పందించారు తాప్సీ. ఇంకా ఆ ఇంటర్వ్యూలో మథియాస్‌ గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా మధ్య జరిగే చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు.

పెళ్లికి వధువు చేసుకునే అలంకరణ గురించి మాట్లాడుతూ – ‘‘మందంగా మేకప్‌ వేసుకుని కనిపించే పెళ్లికూతుళ్లను చూస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే అంత మేకప్‌లో మనం మనలా కనపడం. మన పెళ్లి ఫొటోల్లో మనల్ని మనమే గుర్తుపట్టలేనంతగా ఉంటే ఎలా? పెళ్లి తాలూకు జ్ఞాపకం ఆ క్షణాల వరకే కాదు.. జీవితాంతం ఆ అనుభూతి మిగిలిపోవాలి. అందుకే నా పెళ్లిలో నేను నేనులా కనిపిం చేట్లే ఉంటా. మామూలుగా నా జుత్తు వంకీలు తిరిగి ఉంటుంది. పెళ్లికి కూడా అలానే ఉంచేస్తా’’ అన్నారు తాప్సీ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement