Tarun: ఆ వార్తలో నిజం లేదు : హీరో తరుణ్

Hero Tarun Clarity on Re Entry In Mahesh, Trivikram Movie - Sakshi

మహేశ్‌ బాబు-  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత  వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది.  ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

(చదవండి: గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా!)

అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు.ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గ్యాప్‌ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్‌ మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top