Rajisha Vijayan: Hello June Movie OTT Release Date And Details Inside - Sakshi
Sakshi News home page

Rajisha Vijayan Hello June Movie: ఆహాలో 'హలో జూన్‌' మూవీ..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Mar 31 2022 3:01 PM | Updated on Mar 31 2022 3:46 PM

Hello June Movie Gets OTT Release Date - Sakshi

ఒక అమ్మాయి జీవితంలో కలలు ఎలా ఉంటాయి? అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హలో జూన్‌’. రజీషా విజయన్, జోజు జార్జ్, అశ్వతీ మీనన్, సన్నీ వేన్, సర్జానో ఖలీద్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అహ్మద్‌ కబీర్‌ దర్శకత్వం వహించారు. 2019లో మలయాళంలో విడుదలైన ‘జూన్‌’ చిత్రమే ‘హలో జూన్‌’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. మోజ్విత్‌ అండ్‌ చరణ్‌ తేజ్‌ సమర్పణలో యాంట్స్‌ టు ఎలిఫెంట్స్‌ సినిమాస్‌ కో ప్రొడక్షన్‌పై అనిల్‌ రెడ్డి.

ఎం, జయప్రకాశ్‌ వి. కలిసి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుండి ‘ఆహా’లో ‘హలో జూన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘స్నేహం, ప్రేమ, భావోద్వేగాలతో సాగే చిత్రమిది. కథ ఆసక్తిగా ఉంటూ వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది’’ అన్నారు అనిల్‌ రెడ్డి.ఎం, జయప్రకాశ్‌ వి

Advertisement
 
Advertisement
Advertisement