మారిందేమో  నా రాత!  | Hansika Movie My Name Is Shruti Title Lyrical Video Released | Sakshi
Sakshi News home page

My Name Is Shruti: మారిందేమో  నా రాత! 

Mar 22 2022 11:45 PM | Updated on Mar 22 2022 11:45 PM

Hansika Movie My Name Is Shruti Title Lyrical Video Released - Sakshi

హీరోయిన్‌ హన్సిక టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్‌ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట..’ అంటూ సాగే టైటిల్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్‌ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. మార్క్‌ రాబిన్‌ సంగీతం అందించారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ లాంటి ఇంటెన్స్‌ స్టోరీని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలోని ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రమ్యా ప్రభాకర్‌. ‘మనిషి చర్మం వొలిచి వ్యాపారం చేసే గ్యాంగ్‌తో ఓ యువతి  చేసే పోరాటమే మా చిత్రం’’ అని శ్రీనివాస్‌ ఓంకార్‌ అన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement