దక్షణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది.

ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్‌లోని రంతంబోర్ జాతీయ పార్క్‌ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్‌కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్‌కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే.
దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


