కొత్త చిత్రం షురూ | Sakshi
Sakshi News home page

కొత్త చిత్రం షురూ

Published Sun, Sep 10 2023 6:28 AM

Gopichand and Srinu Vaitla New Movie Launch - Sakshi

గోపీచంద్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్‌స్టార్‌ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్‌ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్‌ ఎర్నేని కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్‌గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ  హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్‌.

Advertisement
Advertisement