Focus Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Focus Review: ఫోకస్‌ మూవీ రివ్యూ

Published Fri, Oct 28 2022 5:17 PM

Focus Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ఫోకస్‌
నటీనటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌ తదితరులు
 నిర్మాత  :  వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌
దర్శకత్వం: జి. సూర్య‌తేజ
సంగీతం: వినోద్‌ యజమాన్య
సినిమాటోగ్రఫీ: ప్రభాకర్‌ రెడ్డి
ఎడిటర్‌: సత్య. జీ
విడుదల తేది: అక్టోబర్‌ 28, 2022

కథేంటంటే..
ఎస్పీ వివేక్‌ వర్మ(భాను చందర్‌), న్యాయమూరి​ ప్రమోద దేవి(సుహాసిని మణిరత్నం) భార్య భర్తలు.  వృత్తిధర్మం పాటిస్తూ.. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వివేక్‌ వర్మ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఎస్సై విజయ్‌ శంకర్‌(విజయ్‌ శంకర్‌) టేకాప్‌ చేస్తాడు. అనేక మలుపుల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ(అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. అసలు వివేక్‌ని హత్య చేసిందెవరు? హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్‌గా మారింది? విజయ్ శంకర్‌ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు ఈ కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. ఇలాంటి కథలను కొత్త దర్శకులు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఫోకస్ చిత్రం కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే తెరకెక్కింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ ఇంట్రెస్టింగ్‌ ఉన్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా ట్విస్టులు ఉంటాయి.  బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవంగా కథనం సాగడం.. క్యారెక్టర్లలో క్లారిటీ లేకపోవడం లాంటి అంశాలు తొలి భాగంలో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టు ఉంటుంది. స్క్రిప్టు పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సినిమా స్థాయి మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
ఎస్సై విజయ్‌ శంకర్‌గా విజయ్‌ శంకర్‌ తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అషురెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ ప్రేమగా అషురెడ్డి పర్వాలేదనిపించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం సుహాసిని పాత్ర అనే చెప్పాలి. అతిథి పాత్రకే పరిమితమైంది. జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. వినోద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రభాకర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ సత్య. జీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Advertisement
Advertisement