Manju Warrier: స్టార్ హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివకాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ కయాట్టం అనే సినిమాలో నటించింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేరాడని హీరోయిన్ ఆరోపించింది.
పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చికోకుండా వేధింపులు గురి చేస్తున్నాడంటూ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు.
ప్రస్తుతం ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కాగా కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు సనల్‌కుమార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.