
‘‘ఎన్న సుగమ్ ఎన్న సుగమ్ ఉళ్ల.... ఇత్తనై నాళ్ ఎంగిరుంద పుళ్ల... ఇరుళ తేడుమ్ వెళక్కిల్ల... ఒళియా వంద ఎనక్కుళ్ల...’ (ఎంత సుఖం ఎంత సుఖం లోపల... ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ పోరి... చీకటిని వెతికే దీపం లేదు... కాంతిలా వచ్చావు నాలోపలికి) అంటూ సాగుతుంది ‘ఇడ్లీ కడై’లోనిపాట. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌తో విడుదల కానుంది.
ఇందులో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఆదివారం ‘ఎన్న సుగమ్...’పాటను విడుదల చేశారు. ధనుష్, నిత్యామీనన్ కాంబినేషన్‌లో ఈపాట సాగుతుంది. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.