RC 15: ఒక్క కాన్సెప్ట్‌ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!

Is Director Shankar Expands Rs 1.73 Crore For RC 15 Concept Poster - Sakshi

Ram Charan And Shankar RC 15 Poster: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ నేడు హైదరాబాద్‌లో పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, కియారాలతో పాటు  డైరెక్టర్‌ శంకర్‌, దిల్‌ రాజు, సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌ సహా మిగిలిన కాస్ట్‌ అండ్‌ క్రూడ్‌ ఉన్నారు. ఇందులో అందరు షూట్‌ ధరించి ఫైల్స్‌తో దర్శనం ఇచ్చారు. ‘వీ ఆర్‌ కమింగ్‌’ అంటూ విడుదల చేసిన ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్‌ చూశారా!

అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌కు శంకర్‌ బాగానే ఖర్చు పెట్టించాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ పోస్టర్‌తో డైరెక్టర్‌ తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. దీనికోసం శంకర్‌ ఒక కోటి 73 లక్షల రూపాయలు ఖర్చు చేయించినట్లు ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క పోస్టర్‌కే ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇక సినిమా పూర్తయ్యేసరికి ఇంకేంత పెట్టిస్తారో అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.

చదవండి: RC15:అదిరిపోయిన రామ్ చరణ్-శంకర్ ఫస్ట్‌ పోస్టర్‌

కాగా ఈ సినిమాకు దిల్‌ రాజు మొత్తం రూ. 250 కోట్లు కేటాయించినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌ అంజలి, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ రోజు హైదరాబాద్‌ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కియారా, చరణ్‌లకు చిరు క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

చదవండి: పెళ్లి తర్వాత కూడా నయన్‌ నటిస్తుందా?, హీరోయిన్‌ స్పందన

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top