Sivakarthikeyan: డైరెక్టర్‌ శంకర్‌ కూతురు హీరోయిన్‌గా శివకార్తికేయన్‌ కొత్త సినిమా

Director Shankar Daughter Aditi Shankar Onboard in Sivakarthikeyan Maaveeran - Sakshi

తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్, డాన్‌ చిత్రాలతో విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రిన్స్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి క్లాప్‌ కొట్టారు. దీనికి ‘మావీరన్‌’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో దర్శకుడు శంకర్‌ వారసురాలు ఆదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈమెకిది రెండో సినిమా. కార్తీ నటించిన విరుమాన్‌ చిత్రంతో కథానాయికగా అదితి శంకర్‌ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే అదితి మరో చిత్రంలో అవకాశం దక్కించుకోవడం విశేషం. కాగా శాంతి టాకీస్‌ సమర్పణలో అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకార్తికేయన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విదు అయన్న ఛాయాగ్రహణంను, భరత్‌ శంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top