Sagar K Chandra: ఆ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి

Director Sagar K Chandra About Bheemla Nayak Movie - Sakshi

‘‘అయ్యారే’కి డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి  పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఆ సినిమా ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ‘భీమ్లా నాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి’’ అని సాగర్‌ కె. చంద్ర అన్నారు. పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సాగర్‌ కె.చంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లాక్‌ డౌన్‌ సమయంలో నిర్మాత నాగవంశీగారు ఫోన్‌ చేసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చూడమనడంతో చూశా.

ఈ సినిమా రీమేక్‌ చేయాలనుకుంటున్నాం.. నీకు ఆసక్తి ఉందా? అనగానే ఓకే చెప్పాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్, రానాగార్లు రావడంతో మరింత ఎగై్జటింగ్‌గా ముందుకెళ్లాం. ఈ సినిమా వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో హ్యాపీ. ‘భీమ్లానాయక్‌’ని త్వరలో హిందీలోనూ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నా తర్వాతి సినిమా రీమేక్‌ కాకుండా స్ట్రైట్‌ మూవీ చేస్తా.‘భీమ్లానాయక్‌’ కి ముందు వరుణ్‌ తేజ్‌తో 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో ఓ సినిమా ప్రక టించారు. బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో ఆగింది.. ఆ కథతోనే సినిమా చేస్తానా? కొత్త కథతోనా? చూడాలి’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top