
ధనుష్ హీరోగా రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం ‘మయక్కమ్ ఎన్న’ (2016). శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీకి మంచి ఆదరణ దక్కింది. జీవీ ప్రకాశ్‌కుమార్ అందించిన పాటలకూ మంచి స్పందన లభించడంతో మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలిచింది. ధనుష్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న ‘మిస్టర్ కార్తీక్’ టైటిల్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు.
ఓం శివగంగా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో–హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు.