Dhamaka Movie Controversy: ధమాకా వివాదం: క్షమాపణలు కోరిన డైరెక్టర్‌ త్రినాథ్‌ నక్కిన

Dhamaka Movie Director Trinadha Nakkina Seeks Apology Over Uppara Controversy - Sakshi

‘ధమకా’ మూవీ వివాదంపై తాజాగా డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పర కులస్థులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్‌ 22) జరిగిన ధమాకా మూవీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నేను ఉప్పర అనే పదం వాడాను. అది తెలిసి చేయలేదు. తెలియక జరిగిన తప్పుకు ఉప్పర సోదరులకు నన్ను క్షమించాలి. రవితేజ అభిమానుల్లో ఉప్పర సోదరుడు కూడా భాగమే. ఇక నుంచి ఉప్పార అనే పదాన్ని నా సినిమాల్లో వాడను. నాపై కోపాన్ని సినిమాపై చూపించకండి. నేను బీసీనే. ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమే. సినిమా ప్రేక్షకుల్లో మీరు కూడా భాగమే.

ఇకపై ఉప్పర పదాన్ని రాజకీయ నాయకుల, సినీ నటులు, ఇతరులు కూడా బహిష్కరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథ్‌ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అని వ్యాఖ్యానించారు. దీంతో తమని ధమాకా డైరెక్టర్‌ తమని అవమానించారంటూ ఉప్పర కులస్తుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే డైరెక్టర్‌ త్రినాథ్‌ తమకు వెంటనే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సాగర్‌ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్‌ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్‌ వద్ద బైఠాయించారు. ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top