Devatha : రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం..స్మశానం నుంచి వచ్చావంటూ..

Devatha Serial : Devudamma Fires On Rukhmini  - Sakshi

సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యేనంటూ నందా ఓ ఫోటోను పంపిస్తాడు. డబ్బులు డిమాండ్‌ చేస్తూ వెంటనే ఇవ్వకపోతే నిజాన్ని బయటకు చెబుతానంటూ బెదిరిస్తాడు. అయితే వాటికి లొంగని ఆదిత్య తనను నేరుగా కలిస్తే సమాధానం ఇస్తానని ఘాటుగా స్పందిస్తాడు. మరోవైపు సత్య ఇంటికి వెళ్లొచ్చిన రుక్మిణిని దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే26న 243వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్యను చూసి వాళ్ల పుటట్టింటి నుంచి తిరిగొచ్చిన రుక్మిణిని గుమ్మం వద్దే దేవుడమ్మ అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రుక్మిణి తలపై నీళ్లు పోసి ఇప్పుడు వెళ్లు లోపలికి అని చెబుతుంది. ఇక దేవుడమ్మ తీరుతో అందరూ షాకవుతారు. సత్యపై చేసిన తప్పుకు ఇంతలా శిక్షించడం అవసరమా అని కనకం ప్రశ్నించగా, సత్య చేసింది తప్పు కాదు నేరం అని చెప్తుంది. సీన్‌ కట్‌ చేస్తే నందా తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతూ పార్టీ చేసుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యే అంటూ వాళ్లిద్దరు దిగిన ఫోటోను నేరుగా ఆదిత్యకే పంపిస్తాడు.

అర్జెంటుగా 2 లక్షల రూపాయలు కావాలని, లేదంటే నిజాన్ని అందరికి చెబుతానని బెదిరిస్తాడు. అయితే నందా బెదిరింపులకు లొంగని ఆదిత్య తననే డైరెక్ట్‌గా కలిస్తే నీ బెదిరింపులకు ఫుల్‌స్టాప్‌ పెడతానని చెబుతాడు. ఇక సీన్‌ కట్‌ చేస్తే..రుక్మిణి భయం భయంగా ఉంటే దేవుడమ్మ తనను దగ్గరికి తీసుకుంటుంది. తన చేతులతో స్వయంగా జుడ వేస్తానని చెప్పి ప్రేమతో లాలించడం చూసి కనకం షాకావుతుంది. ఇదేంటని అడగ్గా తన కోపం కేవలం సత్య మీదే అని, రుక్మిణి మీద కాదని బదులిస్తుంది. ఇక మాట మధ్యలో రంగాను తీసుకొస్తే తనను క్షమిస్తావా అని దేవుడమ్మ ప్రశ్నించగా కనకం ఆలోచనలో పడుతుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top