Kerala Police Filed Complaints Against Sunny Leone In Alleged Cheating Case - Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌పై కేసు.. ఎందుకంటే?

Feb 8 2021 12:42 AM | Updated on Feb 8 2021 2:29 PM

Complaint Filed Against Sunny Leone In Alleged Fraud Case - Sakshi

సన్నీ లియోన్‌ మాత్రం తాను రెండు సార్లు వచ్చానని చెబుతున్నారు.

తిరువనంతపురం: బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌పై కేరళ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్‌ డే ఫంక్షన్‌లో పాల్గొంటానని ఆమె రూ. 29 లక్షలు తీసుకున్నారని, కానీ రాలేదంటూ ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. కొచ్చి బ్రాంచ్‌ క్రైమ్‌ యూనిట్‌ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

వాస్తవాలను తాము పరిశీలించాల్సి ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. అయితే సన్నీ లియోన్‌ మాత్రం తాను రెండు సార్లు వచ్చానని, కానీ వారు కార్యక్రమాన్ని నిర్వహించలేదని చెబుతున్నారు. ఆ కార్యక్రమం అప్పటికే పలు మార్లు వాయిదా పడి చివరికి కొచ్చిలో ఖరారైంది. తనకు ఇంకా రూ. 12 లక్షలు వారే చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చీటింగ్‌ చేసిందంటూ గతంలో కూడా కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ హాట్‌ బ్యూటీపై కేసులు నమోదవడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement