Brahmanandam: హాస్యనటుడు బ్రహ్మానందానికి ఎన్టీఆర్‌ పురస్కారం 

Brahmanandam Received NTR Award in vijayawada - Sakshi

విజయవాడ కల్చరల్‌: సినీ నటుడు ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్‌ ప్రధాన పురస్కారం, వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారాలు అందించారు.

(చదవండి: కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!)

ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తక్కువ సినిమాలే నటించినా ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ యుగం స్వర్ణ యుగమని చెప్పారు. ఎక్స్‌రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి సభను నిర్వహించారు. శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top