కమెడియన్‌ అలీకి జీవన సాఫల్య పురస్కారం

Comedian Ali Received Special Award - Sakshi

సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు.

నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్‌రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్‌ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్‌ పత్రం అందుకొన్నారు.

చదవండి: థియేటర్‌లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ!
సెట్‌లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top