ఆ హీరో నన్ను మోసం చేశాడు.. యువకుడి ఆత్మహత్యాయత్నం | Chittoor Young Man Suicide Attempt Due To Jetty Actor Manyam Murali Krishna, Watch Videos And Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

నా చావుకు కారణం ఆ హీరోనే.. యువకుడి సూసైడ్‌ లెటర్‌ వైరల్‌

Mar 29 2026 11:44 AM | Updated on Mar 29 2026 12:53 PM

Chittoor Young Man Suicide Attempt Due To Jetty Actor Manyam Murali Krishna

భారీ మొత్తంలో నగదు తీసుకొని, తిరిగి ఇవ్వకుండా ఓ హీరో వేధిస్తున్నాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణనే అంటూ రాసిన సూసైడ్‌ లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌  అవుతుంది.

‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీ కృష్ణకి తన బంధువుల ద్వారా రూ.3.15 కోట్లు ఇప్పించానని, తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు లోకేశ్‌ను బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు తీసుకెళ్లారు.  పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది.

సూసైడ్‌ లెటర్‌లో ఏముంది?
సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయం గురించి లోకేష్‌ రాసుకొచ్చాడు. ‘నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా అమ్మనాన్నలను, భార్యబిడ్డలను ఈ స్తాయికి తీసుకోస్తానని అనుకోలేదు. నా కుటుంబాన్ని ఈ రోజు నేను రోడ్డుపైకి తీసుకొచ్చాను. అంతా అప్పుల పాలు అయిపోయాను. నన్ను క్షమించండి. ఈ రోజు నేను తల ఎత్తుకొని బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణ. ఇతను రైల్వే కాంటాక్ట్‌ పేరుతో మోసం చేశాడు. మొత్తం మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందులో నా బంధువులతో పాటు సోదరులు కూడా డబ్బులు పెట్టారు. ఇతని వల్ల అందరూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ఇన్నిరోజుల నా కష్టం మొత్తం వృధా అయింది. అతన్ని(మురళీ కృష్ణ) మాత్రం వదలకండి. ఇతనితో పాటు వాళ్ల తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు కలిసి మోసం చేశారు. డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక సూసైడ్‌ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి’ అని సూసైడ్‌ లెటర్‌లో రాసుకొచ్చాడు.



గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement