Mega Star Chiranjeevi Likely Plans To OTT Entry, Details Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!

Published Fri, Jul 8 2022 11:07 AM

Chiranjeevi Plans To OTT Entry - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్‌ బిజీగా ఉన్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘గాడ్‌ఫాదర్‌’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్‌’ షూటింగ్‌ కూడా జెడ్‌ స్పీడ్‌లో జరుగుతోంది. ఇక బాబీ దర్శకత్వం తెరకెక్కే చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలే కాకుండా.. మరో రెండు సినిమాలకు కూడా త్వరలో అనౌన్స్‌ చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. ఇలా వరుస సినిమాలతో ఫుల్‌ బీజీగా ఉన్న చిరు.. తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తునాయి. త్వరలోనే ఆయన డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట. 

(చదవండి: మహారాజా సుహేల్‌ దేవ్‌గా రామ్‌చరణ్‌!)

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్‌ కంటే ఎక్కువగా ఓటీటీల వైపే మొగ్గచూపుతున్నారు.దీంతో బడా హీరోలు సైతం ఓటీటీ సినిమాలకు, వెబ్‌ సిరీస్‌లకు సై అంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు చిరంజీవిని సంప్రదించినట్లు సమాచారం. వారి దగ్గరు ఉన్న కొత్త కాన్సెప్ట్‌లను కూడా వినిపించారట.

అయితే తన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తన క్యారెక్టర్‌ చాలా ఫవర్‌ఫుల్‌ ఉండేలా కథను సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారట. చిరు ఓటీటీ ఎంట్రీ అంటే మాములు మాటలు కాదు. ఆయన రేంజ్‌కి తగ్గ కథ ​దొరకాలి. మరి చిరుకు నచ్చే కంటెంట్‌ని ఏ ఓటీటీ సంస్థ అందిస్తుందో చూడాలి. ఒకవేళ అన్ని కుదిరి చిరంజీవి ఓ మంచి  వెబ్‌ సిరీస్‌తో వస్తే మాత్రం ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
 
Advertisement