Megastar Chiranjeevi Women's Day Gift to Sushmita Konidela - Sakshi
Sakshi News home page

Chiranjeevi: వుమెన్స్‌ డే.. సుష్మితకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన మెగాస్టార్‌

Mar 9 2023 2:39 PM | Updated on Mar 9 2023 3:19 PM

Chiranjeevi Gives Gift to Sushmita Konidela On Womens Day - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూతురికి గిఫ్ట్‌ ఇచ్చాడు చిరంజీవి. బంగారు, వెండి పూత కలగలిపి ఉన్న దుర్గాదేవి ప్రతిమను సుష్మితకు కానుకగా అందించాడు. ఈ

వాల్తేరు వీరయ్యతో అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ అందించాడు మెగాస్టార్‌ చిరంజీవి. తనను ఫ్యాన్స్‌ ఎలా చూడాలని కోరుకున్నారో అంతకుమించి మాస్‌ యాంగిల్‌లో కనిపించి ట్రీట్‌ ఇచ్చాడు. దీని వెనకాల చిరు కూతురు సుష్మిత హస్తం కూడా ఉంది. వాల్తేరు వీరయ్యలో బాస్‌ పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు ఆమె ఎంతగానో కష్టపడింది. ఈ సినిమాకు తనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. సుష్మిత అందించిన కాస్ట్యూమ్స్‌లో అటు మాస్‌ లుక్‌లో, ఇటు పాటల్లో క్లాస్‌ లుక్‌లో అదరగొట్టేశాడు బాస్‌.

ఇదిలా ఉంటే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూతురికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు చిరంజీవి. బంగారు, వెండి పూత కలగలిపి ఉన్న దుర్గాదేవి ప్రతిమను సుష్మితకు కానుకగా అందించాడు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సుష్మిత. 'నాకు ఈ బహుమతిచ్చినందుకు థాంక్యూ నాన్న. మహిళను దుర్గాదేవి కంటే శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు?' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా నిర్మాతగా మారిన సుష్మిత ఇటీవలే శ్రీదేవి శోభన్‌బాబు సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే! కానీ ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement