
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు (జనవరి 26) గణతంత్య దినోత్సవం కావడంతో టీజర్ విడుదల చేస్తారని అందరూ వేయికళ్లతో చూస్తున్నారు. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంతో చిరు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ అందించారు. ఆచార్య టీజర్ అప్‌డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటన మెగాస్టార్ కాస్తా వినూత్నంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో చిరంజీవి, కొరటాల శివ మధ్య టీజర్ విడుదల ఎప్పుడన్న విషయంపై సరదా సంభాషణ జరుగుతున్నట్లు వివరించారు. చదవండి: గణతంత్ర వేడుకల్లో మెగా ఫ్యామిలీ
ఇక మెగాస్టార్ నుంచే టీజర్ విషయం బయటికి రావడంతో రేపటి కోసం అభిమానులు ఈ సారి క్లారిటీగా ఉన్నారు. కాగా చందమామ కాజల్ ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండగా అతనికి జోడీగా పూజాహెగ్డే నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. చదవండి: ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది
So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021
#Acharya pic.twitter.com/YdZ84lkXhL