రాజమౌళి మాట ఇచ్చారు.. ఈ సారైనా నమ్మొచ్చా?

Can We Trust Rajamouli On Rrr Movie Release? - Sakshi

RRR Release Date: దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తన సినిమాల ఔట్‌పుట్‌ విషయంలో ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జక్కన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడా అని ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో అక్టోబర్‌ 13 అని ప్రకటించి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చారు.

ఇదిలా ఉండగా జక్కన్న సినిమా ఔట్‌పుట్‌ పరంగా ఏ మాత్రం రాజీపడరన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను ప్రకటించిన తేదికి విడుదల చేస్తాడా లేదా అనే సందేహం అభిమానుల్లో ఉంది. జక్కన్న విషయానికొస్తే.. ఇంతకు ముందు తన సినిమాల విడుదల తేదిని పలుమార్లు వేరువేరు కారణాలతో మార్చారు. సీన్లు నచ్చక పోతే సునాయాసంగా కత్తిరించడమే కాకుండా రీషూట్‌ చేయడానికి కూడా వెనుకాడరు. అంతెందుకు ‘ఈగ’ సినిమాలో గ్రాఫిక్స్‌ సీన్లు ఆశించినంత స్థాయిలో లేవని ఎన్ని కత్తిరింపులు పడ్డాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరో వైపు ఈ సినిమా విషయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌లకు ఆయన పెద్ద వాగ్దానమే చేశాడంట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మిగిలిన షూట్‌ను ఎలాగైనా ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి తదుపరి ప్రాజెక్టులలో పాల్గొనేలా వాళ్లకు హామీ ఇచ్చారని సినివర్గాల్లో టాక్‌. దీని ప్రకారం చూస్తే చిత్ర యూనిట్‌ ప్రకటించినట్లుగానే అక్టోబర్‌లో విడుదల అవుతుందనే అనిపిస్తున్న రాజమౌళిని నమ్మాలేమని అభిమానుల్లో ఓకింత అనుమానం కూడా అలానే ఉండిపోయింది. కాగా ఇటీవలే చిత్ర యూనిట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాని రెండు పాటలు మినహా షూటింగ్‌ అంతా పూర్తయిందని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రెండు భాషలకు డబ్బింగ్‌ కూడా పూర్తిచేశారని, మిగిలిన భాషల్లో డబ్బింగ్‌ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ పూర్తవుతుందని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ వెల్లడించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top