Sonu Sood: భారీగా పెంచిన రెమ్యునరేషన్!

కరోనాకు ముందు సోనూసూద్ విలన్‌గానే అందరికీ పరిచయం. కానీ కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరో అని నిరూపించుకున్నాడీ నటుడు. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండన్న ఎందరికో సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఓ వైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సోనూసూద్. అతడు ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా అతడికి 'అఖండ' మూవీ నుంచి ఆఫర్ వచ్చినట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తోంది.
'అఖండ' చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నిర్మాతలు సోనూను సంప్రదించగా అతడు రూ.7 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 'అల్లుడు అదుర్స్' సినిమాకు రెండున్నర కోట్లు అందుకున్న సోనూ ఓకేసారి తన పారితోషికాన్ని ఇంత భారీ మొత్తం పెంచడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారం సోనూకు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సోనూ ఏడు కోట్లు డిమాండ్ చేయడంలో తప్పేం లేదని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.