Butta Bomma: అర్జున్‌ దాస్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా? | Butta Bomma: Arjun Das First Time Play Positive Role, Attracted Audience | Sakshi
Sakshi News home page

Butta Bomma: అర్జున్‌ దాస్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా?

Feb 5 2023 2:56 PM | Updated on Feb 5 2023 2:56 PM

Butta Bomma: Arjun Das First Time Play Positive Role, Attracted Audience - Sakshi

సౌత్‌ సినిమా ఇండస్ట్రీ నుంచి బాగా ఫేమస్‌ అవుతున్న నటుల్లో అర్జున్‌ దాస్‌ ఒకడు.  ఖైదీ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ అయినా సరే అర్జున్ దాస్ నటన చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అర్జున్‌ దాస్‌ వాయిస్‌కి అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఇప్పటికీ యూట్యూబ్ లో అతని వీడియో లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

‘మాస్టర్’, ‘విక్రమ్‌’ తర్వాత అర్జున్‌ దాస్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నింటిలోనూ నెగెటివ్‌ రోల్స్‌ చేశాడు. కానీ తొలిసారి ‘బుట్ట బొమ్మ’ చిత్రంలో పాజిటివ్ రోల్ పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. అనిఖా సింగ్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శనివారం(ఫిబ్రవరి 4) విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.

ఈ చిత్రంతో ఆర్కేగా అర్జున్‌ దాస్‌ అదరగొట్టేశాడు. ఈ పాత్రలో అర్జున్‌ని తప్ప మరే నటుడిని ఊహించుకోలేం. ఇంటర్వెల్‌కి ముందు అతని పాత్ర పరిచయం అవుతుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం అర్జున్‌ దాస్‌ చుట్టు కథ తిరుగుతుంది. ‘బుట్ట బొమ్మ’  విజయంలో  అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషించడమే కాదు.. తనలో మరో యాంగిల్‌ ఉందని కూడా ప్రేక్షకులు చూపించాడు. 

కేవలం విలన్‌ పాత్రలే కాదు.. హీరోగానూ రాణించగలడనే విషయం బుట్టబొమ్మ ద్వారా తెలిసింది. మంచి కథతో సినిమా చేస్తే..అర్జున్‌ దాస్‌ హీరోగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మన దర్శక నిర్మాతలు అర్జున్‌ దాస్‌ని ఎలా వాడుకుంటారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement