మీర్జాపూర్‌ను బాయ్‌కాట్‌ చేస్తారా?

Boycott Mirzapur2 Hash Tag Trending on Twitter, Fans Reaction  - Sakshi

అనుకున్నట్లు అన్నీ కుదిరితే వచ్చే నెలలో మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్‌ సీక్వెల్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. మీర్జాపూర్‌ సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా పార్ట్‌ 1 విషయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్‌తో రాజమౌళి ఫ్యాన్స్‌ను ఊరించిన మాదిరిగా ఈ వెబ్‌సిరీస్‌ మొదటి పార్ట్‌ చివరిలో కూడా ఒక ట్విస్ట్‌ ఉంటుంది. అందుకే ఎప్పుడెప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌  విడుదల అవుతుందా? ఈ ట్విస్ట్‌ ఏంటో తెలుసుకుందామా అని ఫ్యాన్స్‌ ఎదరు చూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్‌ కు ఇబ్బందులు తప్పేటట్టు కనిపించడం లేదు. 

దానికి ప్రధాన కారణం కో ప్రొడ్యూసర్‌  ఫర్హ ఖాన్‌, హీరో అలీ ఫజల్‌. వీరు గత ఏడాది పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. దీంతో #బాయ్‌కాట్‌ మీర్జాపూర్‌2  అని ట్వీట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం దీనికి వ్యతిరేకంగా వెబ్‌ సిరీస్‌ విడుదల కావాలని తమ వంతు ప్రచారం  చేస్తున్నారు. దీనిపై వివిధ రకాల మీమ్స్‌ ద్వారా సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు.   మంగళవారం ఈ చిత్రం టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.  

చదవండి: ‘మీర్జాపూర్‌-2’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top