
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్‌బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్‌బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్‌బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో ఆయన్ను వైల్డ్ కార్డ్‌గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!
వైల్డ్ కార్డ్‌గా..
పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్‌లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్‌బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.
తెలుగు సినిమాలో..
కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్‌లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.