
షణ్ముఖ్ మగాడై ఉండి, నంగనాచిగా ఎవరికీ తెలీకుండా దొంగచాటుగా గేమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మాత్రం సిరి దగ్గరకు వెళ్లి..
Bigg Boss Telugu 5, Sarayu Roy Says Bigg Boss Injustice Her: 7 ఆర్ట్స్ సరయూ 7 డేస్‌కే బిగ్‌బాస్ ఐదో సీజన్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే వచ్చేముందు బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరికి దుమ్ము దులిపింది. సిరి, షణ్ముఖ్.. బయటే ఫిక్సింగ్ చేసుకుని వచ్చారని ఆరోపించింది. షణ్ముఖ్‌కు ఒంటరిగా ఆడటం చేతకాదని, అలాంటప్పుడు గాజులేసుకుని మూలన కూర్చోవాలంటూ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలతో హర్ట్ అయిన షణ్నూ అభిమానులు సరయూ మీద నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో తనతో పాటు, తన తల్లిని కూడా దారుణంగా తిడుతూ కామెంట్లు చేశారని వాపోయింది సరయూ. తను షణ్నూను ఎందుకు కించపరిచి మాట్లాడాల్సి వచ్చిందో తాజా వీడియోలో వెల్లడించింది.
షణ్ముఖ్ నంగనాచిలా గేమ్ ఆపేందుకు ట్రై చేశాడు
అందులో సరయూ మాట్లాడుతూ.. 'తొలివారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో పోటీదారులు తొక్కే సైకిల్ లైట్ వెలుగుతుందా? లేదా? చూసుకునేందుకు వారి ముందు అద్దాలు పెట్టారు. టాస్క్ మధ్యలో సిరి, షణ్ముఖ్ సైగలు చేసుకున్నారు. దీంతో షణ్నూ.. వెంటనే హమీదాకు సైకిల్ లైట్ కనిపించకుండా ఆమె ముందు నిల్చున్నాడు. తనకు లైట్ కనిపించట్లేదని హమీదా చెప్పడంతో అక్కడి నుంచి జరగమని షణ్నూకు పలుమార్లు సూచించారు. కానీ అతడు మాత్రం అందుకు నిరాకరించాడు. ఒ పక్క కాజల్ ధైర్యంగా అందరి ముందు వెనక నుంచి అటాక్ చేస్తుంది. కానీ షణ్ముఖ్ మగాడై ఉండి, నంగనాచిగా ఎవరికీ తెలీకుండా దొంగచాటుగా గేమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మాత్రం సిరి దగ్గరకు వెళ్లి నీకసలు సపోర్ట్ చేయలేదు అంటూ అబద్ధమాడాడు. సెప్టెంబర్ 9వ ఎపిసోడ్‌లో 46వ నిమిషం నుంచి చూస్తే వారి సైగలు మీకు తప్పకుండా కనిపిస్తాయి' అని మొదటి సాక్ష్యాన్ని బయటపెట్టింది.
కెప్టెన్ అవ్వాలనుకోలేదని డ్రామా, కానీ ముందే అనుకుని వచ్చింది
'నేను కెప్టెన్ అవ్వాలనుకోలేదు అంటూ అంత ఏడ్చి డ్రామా చేసిన సిరి హౌస్‌లో ఒక మాట అంది. ఫస్ట్ కెప్టెన్ నేనే అవుతానంటూ బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పి వచ్చానని అందరి ముందే గట్టిగా అరిచి చెప్పింది. కానీ ఇది టెలికాస్ట్ అవలేదు. ఇకపోతే రవి.. ముళ్లపంది అన్నందుకు లోబో హర్టయ్యాడు. తనను ఎలిమినేట్ చేసి పంపించేయమని ఏడ్చాడు. అప్పుడు నేను అతడికి ధైర్యం చెప్పాను. నేను లోబోతో కామెడీ చేస్తుంటే చూడలేక రవి అన్న అతడిని నా దగ్గరి నుంచి తీసుకెళ్లిపోయేవాడు. ఇక నాగార్జునగారు బూతులు మాట్లాడమని చెప్పినప్పటికీ.... బిగ్‌బాస్ షోను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని బూతులు మాట్లాడలేదు. కానీ సిగరెట్ తాగితే ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు' అంటూ ఏడ్చేసింది.
బిగ్‌బాస్ షోకు నేను అన్‌ఫిట్
ఒకవేళ మళ్లీ బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వస్తే వెళ్తారా? అన్న ప్రశ్నకు.. తాను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని చెప్పింది. ఒకవేళ మళ్లీ వెళ్లినా వారం రోజుల్లోనే వచ్చేస్తానని, ఎందుకంటే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు అని అభిప్రాయపడింది సరయూ. ఒకవిధంగా బిగ్‌బాస్ తనపై పక్షపాతం చూపిస్తూ అన్యాయం చేశాడని బాధపడింది.