బిగ్‌బాస్‌ 5: కంటెస్టెంట్స్‌ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్‌!

Bigg Boss 5 Telugu: Bigg Boss 5 Contestants New List Goes Viral - Sakshi

ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో అగష్టు 22 నుంచి కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్‌ పంపించనున్నారని వినికిడి. కానీ బిగ్‌బాస్‌ 5 సీజన్‌ కంటస్టెంట్స్‌కు సంబంధించిన ఖచ్చితమైన జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

చదవండి: బిగ్‌బాస్‌ 5: బిగ్‌బాస్‌ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్‌, సింగర్‌!

ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్‌ స్టార్ల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో జాబితా బయటకు వచ్చింది. అయితే ఇందులో కొంతమంది కొత్తవాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్‌ రవి, ఆర్‌జే కాజల్‌, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్‌ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్‌ సరయు, నటుడు మానస్‌ షా, మోడల్‌ జస్వంత్‌, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్‌ ప్రత్యూష్‌, ఆట సందీప్‌/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి.

చదవండి: బిగ్‌బాస్‌ 5 తెలుగు: బిగ్‌బాస్‌ బజ్‌ హోస్ట్‌గా అరియాన గ్లోరీ!

ఇంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్‌ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌, యానీ మాస్టర్‌, యూట్యూబర్‌ నిఖిల్‌ల పేర్లు ఉండగా.. ఈ కొత్త లిస్టులో వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో  ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అని, అందులో డౌట్‌ లేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల బిగ్‌బాస్‌ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షో హోస్ట్‌ ఎవరనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్‌ పెడుతూ నాగార్జున ‘బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వ‌చ్చేసింది బిగ్‌బాస్‌ తెలుగు సీజ‌న్ 5’ అంటూ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. 

బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్స్‌ కొత్త జాబితా:

 •  యాంకర్‌ రవి
 •  ఆర్‌జే కాజల్‌
 •  శ్వేతా వర్మ
 •  లహరి షారి
 •  కమెడియన్‌ లోబో
 •  సిరి హన్మంతు
 •  నటి ప్రియ
 •  కార్తీకదీపం ఉమాదేవి
 •  7 ఆర్ట్స్‌ నటి సరయు
 •  నటుడు మానస్‌ షా
 •  మోడల్‌ జస్వంత్‌
 •  నటుడు సన్నీ
 •  విశ్వ
 •  టీవీ9 యాంకర్‌ ప్రత్యూష్‌
 •  ఆట సందీప్‌/రఘు మాస్టర్లు
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top