నోయ‌ల్ అవుట్‌, మోక‌రిల్లి దండం పెట్టిన అవినాష్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ నుంచి నోయ‌ల్ నిష్క్ర‌మ‌ణ‌

Published Sat, Oct 31 2020 11:32 PM

Bigg Boss 4 Telugu: Noel Exits Show, Blast On Avinash, Amma Rajasekhar - Sakshi

నోయ‌ల్ అభిమానుల‌కు చేదువార్త‌. త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో రీఎంట్రీ ఇస్తాడ‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న త‌రుణంలో అత‌డు నోయ‌ల్ అంద‌రి ద‌గ్గ‌రా వీడ్కోలు తీసుకుని షో నుంచి నిష్క్ర‌మించాడు. హౌస్‌లో ఉన్న‌న్ని రోజులు బాబాగా ఉన్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం నిజ‌మైన నోయ‌ల్ క‌నిపించాడు. తాను చెప్పాల‌నుకున్న మాట‌ల‌ను తూటాలుగా మ‌లిచి కంటెస్టెంట్ల మీద‌కు వ‌దిలాడు. మ‌రికొంద‌రికి మంచి మాట‌ల‌తో పూల బాణాల‌ను వ‌దిలాడు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే దీన్ని చ‌దివేసేయండి..

కులు మ‌నాలీ నుంచి కొత్త బ‌ట్ట‌లు తెచ్చిన నాగ్‌
ఈ మ‌ధ్య ఎలిమినేష‌న్స్ అన్‌ఫెయిర్‌గా ఉంటున్నాయ‌ని బిగ్‌బాస్ షోపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై హోస్ట్ నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. మీరు వేసే ఓటును బ‌ట్టే ఎలిమినేష‌న్ జ‌రుగుతుంద‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టి చెప్పారు. ఇక కులు మ‌నాలీ నుంచి వ‌స్తూ వ‌స్తూ కంటెస్టెంట్ల కోసం కొత్త‌బ‌ట్ట‌లు కూడా తీసుకురావ‌డం విశేషం. అనంత‌రం అఖిల్‌, సోహైల్‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి వీడియో చూపించారు. ఇందులో ఎక్క‌డి విష‌యాలు అక్క‌డే వ‌దిలేయ్ అని సోహైల్ మోనాల్‌కు మంచి మాట‌లు చెప్పాడు. అయినా ఆమె మార‌క‌పోగా అఖిల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి సోహైల్ నీ గురించి మాట్లాడుతున్నాడ‌ని చెప్ప‌డంతో వారి మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. అయితే ఈ వీడియో ద్వారా అస‌లేం జ‌రిగింద‌నేది వారికి ఓ క్లారిటీ వ‌చ్చింది. దీంతో వీళ్ల మ‌ధ్య అపార్థాలు తొలిగిపోయాయి.

మాస్ట‌ర్ స్వార్థం కోసం అరియానాకు సాయం
అనంత‌రం మోనాల్‌కు బిగ్‌బాస్‌ ఓ వీడియో చూపించాడు. మోనాల్ న‌న్ను మోసం చేసింది అని అభి మాట్లాడిన‌దానితో పాటు, ఆమె ఒంటెలా న‌డుస్తుంద‌ని కామెంట్ చేశాడు. లాస్య‌, నోయ‌ల్ కూడా త‌న గురించి అభికి చెప్పడాన్ని‌ చూపించాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ కొన్నిసార్లు ప‌క్క‌నున్న వాళ్ల ద్వారా కూడా దూరాలు పెరుగుతాయ‌ని హెచ్చ‌రించారు. ఇక అరియానాకు మాస్ట‌ర్ మాట్లాడిన వీడియో చూపించారు.  నీ ద‌గ్గ‌ర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మాస్ట‌ర్ నీకు సాయం చేశాడ‌ని నాగ్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం గురించి అరియానా మాట్లాడుతూ.. కెప్టెన్ కావాల‌ని క‌ల‌లు క‌న్నాను, కానీ అయ్యాక చాలా బాధ‌ప‌డ్డాను అని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్‌)

సోహైల్‌కు అరియానా విల‌న్‌, కానీ ఆమెకు మాత్రం కాదు
ఈ 56 రోజుల జ‌ర్నీలో విల‌న్ ఎవ‌రు? అంటూ నాగ్ కంటెస్టెంట్ల‌తో ఓ ఆట ఆడించారు. అఖిల్ త‌న‌కు అభిజిత్ విల‌న్ అని, సోహైల్‌కు అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు అభిజిత్‌, హారిక‌కు మెహ‌బూబ్‌, మెహ‌బూబ్‌కు హారిక‌, అవినాష్‌కు లాస్య‌, లాస్యకు అవినాష్‌, అరియానాకు అఖిల్‌, అభిజిత్‌కు మాస్ట‌ర్‌, మోనాల్‌కు లాస్య విల‌న్‌గా అనిపించార‌ని చెప్పుకొచ్చారు. త‌ర్వాత అఖిల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి:సంకేతాలిచ్చిన బిగ్‌బాస్‌: మాస్ట‌ర్ ఎలిమినేట్?!)

ఫ‌స్ట్ వీక్‌లోనే నాకు నొప్పి స్టార్ట్ అయింది: నోయ‌ల్‌
నోయ‌ల్ ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా అత‌డు హౌస్‌లో ఉండ‌టం స‌రికాద‌ని వైద్యులు సూచించార‌, దీంతో అత‌డు వెళ్లిపోతున్న‌ట్లు నాగ్ వెల్ల‌డించారు. త‌నకు 'ఆంక్లియో స్పాంటిలైటిస్'‌ ఉంద‌ని, హౌస్‌లోకి వెళ్లిన మొద‌టి వారంలోనే కాళ్ల నొప్పి ప్రారంభ‌మైందని నోయ‌ల్ తెలిపాడు. అయినా స‌రే ఆ నొప్పిని పంటికింద భ‌రిస్తూ, అంద‌ర్నీ ఎంట‌ర్‌టైన్ చేస్తూ హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్ అవ‌డం విశేషం. ఇక నోయ‌ల్‌.. అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ల‌ను ఒంటికాలి మీద నిల‌బ‌డ‌మని ప‌నిష్మెంట్ ఇచ్చాడు. అభి, హారిక‌, లాస్య టాప్ 5లో ఉండాల‌న్నాడు. మోనాల్‌ను ఏడ‌వ‌ద్ద‌ని, లాస్య‌ను దేన్నీ పట్టించుకోవ‌ద్ద‌ని, సోహైల్‌ను చిన్న పిల్లాడ‌ని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో త‌న వెన్నెముక నోయ‌ల్ వెళ్లిపోతున్నాడంటూ హారిక‌ ఏడ్చేసింది. ఆమెను బుజ్జ‌గించడం కోసం ఓ ర్యాప్ సాంగ్ పాడి అంద‌రి చేత ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

నా బాధ‌ను హేళ‌న చేశారు: నోయ‌ల్‌
ఆ త‌ర్వాత‌ ఒంటికాలిపై నిల్చున్న ఆ ఇద్ద‌రినీ కాళ్లు నొప్పెట్టాయా? అని అడ‌గ్గా అవున‌ని త‌లూపారు. దీని క‌న్నా వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి ప్ర‌తిరోజూ అనుభ‌విస్తున్నాన‌ని నోయ‌ల్ త‌న బాధ‌ను బ‌య‌ట‌కు క‌క్కాడు. "నాకు ఆంక్లియోస్పాటిలైసిస్ ఉంది. పొద్దున లేచాక అర‌గంట కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే న‌డ‌గ‌ల‌ను. దాన్ని మీరిద్ద‌రూ జోక్ చేస్తారేంటి?" అని నిల‌దీశాడు. తాను ఎలా న‌డిచానో చూపిస్తూ అవినాష్ ఎగ‌తాళి చేశాడ‌ని చెప్పాడు. కానీ అత‌డి కాలికి దెబ్బ త‌గిలినప్పుడు తాను క‌ట్టు క‌ట్టాన‌ని పేర్కొన్నాడు. దీంతో అవినాష్ "మీరు కావాల‌ని ఇద్ద‌రినీ బ్యాడ్ చేస్తున్నార‌ని మండిప‌డ్డాడు. ప్రేక్ష‌కుల ముందు బ్యాడ్ చేయొద్ద‌ని హిత‌వు ప‌లికాడు. చిల్ల‌ర కామెడీ అయితే ఇక్క‌డి వ‌ర‌కు వ‌స్తానా? "అని ఆవేశంతో ఊగిపోగా ఇవే త‌గ్గించుకుంటే మంచిదని నోయ‌ల్ స‌మాధాన‌మిచ్చాడు. (చ‌ద‌వండి:సోనూసూద్‌, మోనాల్‌కు స‌పోర్ట్ చేయండి)

మోక‌రిల్లి సారీ చెప్పినా క‌నిక‌రించ‌ని నోయ‌ల్‌
అలా అయితే నువ్వు ఇన్నిరోజులు న‌టించావంటూ అవినాష్‌ నోయ‌ల్‌ను త‌ప్పు ప‌ట్టాడు. కామెడీని త‌క్కువ చేసి మాట్లాడొద్ద‌ని సూచించాడు. "మిమిక్రీని త‌ప్పు ప‌డుతున్నావు, క‌ళామ‌త‌ల్లిని అవ‌మానిస్తున్నావు అంటూ అవినాష్ అస‌లు విష‌యాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు క‌నిపించింది. కానీ చివ‌రికి మాత్రం మోకాళ్ల‌పై మోక‌రిల్లి రెండు చేతులు జోడించి సారీ చెప్పాడు. త‌ప్పు చేసి సారీ చెప్ప‌డం పెద్ద‌రికం కాదని నోయ‌ల్ చెంప‌పెట్టుగా స‌మాధాన‌మిచ్చాడు. అనంత‌రం లాస్య సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. చివ‌ర‌గా ర్యాప్ సాంగ్‌తో నోయ‌ల్ వీడ్కోలు తీసుకున్నాడు. ఇన్నిరోజులు అత‌డు కేవ‌లం శారీర‌క బాధ‌నే కాకుండా మ‌నాసిక వేద‌న‌ను కూడా భ‌రించిన‌ట్లు నేటి ఎపిసోడ్‌తో రుజువు అయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement