కొత్తగా ట్రై చేశాను : హీరో అశ్విన్ బాబు | Ashwin Babu Talk About On Shivam Bhaje Movie At Press Conference | Sakshi
Sakshi News home page

కొత్తగా ట్రై చేశాను : హీరో అశ్విన్ బాబు

Jul 31 2024 6:22 PM | Updated on Jul 31 2024 6:45 PM

Ashwin Babu Talk About Shivam Bhaje Movie

‘హిడింబ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ శివం భజే కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. అది ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు హీరో అశ్విన్‌ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వంలో  వహించిన ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్‌ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

శివంభజే చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది.

శివం భజేలో చాలా మెచ్యూర్డ్‌గా, స్టైలీష్ యాక్షన్ చేశావ్ అన్నా అని మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అన్నారు. అది నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్. టీం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ పట్ల సంతృప్తి చెందారు. డైరెక్టర్‌ ఈ కథలో డివైన్ పాయింట్‌‌ను ఎలా కనెక్ట్ చేశారన్నదే ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

హిడింబకు సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని చూసి వారంతా సంతోషించారు. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. అప్సర్ తీసిన పాయింట్, ఐడియాలజీ చాలా నచ్చింది.

వికాస్ బడిస మ్యూజిక్, అప్సర్ రాసిన కథ, శివేంద్ర విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శివయ్య మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యంగా ముందడుగు వేశారు.

నా బర్త్ డే, నిర్మాత పుట్టిన రోజు ఆగస్ట్ 1న కాబట్టి సినిమాను ఆ డేట్‌ను రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఒక డేట్ అనుకున్నాం. ఆ డేట్ మా బర్త్ డే అయింది. అంతే కానీ.. కావాలని ప్లాన్ చేసింది అయితే కాదు.

దిగంగనా అద్భుతంగా నటించారు. అర్బాజ్ ఖాన్ గారితో మంచి సీన్స్ ఉంటాయి. ఆయన పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది.

నేను ఒక మంచి డ్యాన్సర్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంత వరకు తెరపై అంతగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. సినిమా కథకు సరిపోతేనే డ్యాన్స్ పెట్టమని అంటాను. కథలో భాగంగానే అన్నీ రావాలని ఫీల్ అవుతాను. థియేటర్లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాను.

మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ప్రతీ సారి నేను ఆయన్ను బడ్జెట్ విషయంలో కంట్రోల్ చేస్తుండేవాడ్ని. కానీ ఆయన సినిమాకు ఏం కావాలో అంత కంటే ఎక్కువే పెట్టారు. ఏమైనా అంటే శివయ్య ఉన్నారని అంటుండేవారు. ఆయన ఎలా అనుకున్నారో సినిమా అలా వచ్చింది.

అందరూ రాజు గారి గది ఫ్రాంచైజీల గురించి అడుగుతున్నారు. కానీ నాకు ఎక్కువగా థ్రిల్లింగ్ సబ్జెక్టులే వస్తున్నాయి. రాజు గారి గది 4 ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అన్నయ్య కథను రాస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement