బ్లాక్‌బస్టర్‌ సినిమా ఫ్రాంచైజీలో అశోక్‌ గల్లా | Ashok Galla Will Plan Husharu Movie Sequel | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బస్టర్‌ సినిమా ఫ్రాంచైజీలో అశోక్‌ గల్లా

Apr 16 2026 12:26 PM | Updated on Apr 16 2026 1:10 PM

Ashok Galla Will Plan Husharu Movie Sequel

ఫ్రెండ్‌షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో 2018లో విడుదలైన చిత్రం హుషారు.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలు ఎలా ఉంటాయి దర్శకుడు  శ్రీహర్ష కొనుగంటి ఫన్నీగా చూపిస్తూ యూత్‌కు కనెక్ట్‌ అయ్యే ప్రేమ కథను చూపించాడు. ఇందులో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా వంటి వారు నటించారు. అయితే, తాజాగా రానున్న పార్ట్‌-2లో అశోక్ గ‌ల్లా నటించనున్నారని తెలుస్తోంది.

‘హీరో’ సినిమాతో వెండితెరకు పరిచయమైన  అశోక్‌ గల్లా.. మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత 'దేవకీ నందన వాసుదేవ' చిత్రంతో అలరించాడు. అయితే, ఇప్పుడు హుషారు-2 చిత్రంలో భాగం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కూడా శ్రీహర్ష కొనుగంటినే దర్శకత్వం వహించనున్నారు. ఈ వార్త నిజమైతే, అశోక్‌ గల్లా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. అశోక్ గల్లా తన తొలి చిత్రం 'హీరో'తో ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ ప్రాజెక్ట్‌ సరిగ్గా సెట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేశ్‌ బాబుకు మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీలోకి అశోక్‌ ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి సినిమా హీరోతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు హుషారు-2తో తన జోరు చూపేంచే ప్లాన్‌లో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement