పిశాచి 2: బోల్డ్‌ పాత్రలో నటించనున్న హీరోయిన్‌!

Andrea Jeremiah Agrees To Go Bold For Mysskin Pisasu 2 Shooting - Sakshi

తమిళ చిత్రం పిశాసు(తెలుగులో పిశాచి) సినిమా ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీంతో గతేడాదే దీనికి సీక్వెల్‌​ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మిస్కిన్‌. ఏడాది ప్రారంభంలో షూటింగ్‌ కూడా మొదలు పెట్టారు. కానీ అంతలోనే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రావడంతో అర్ధాంతరంగా చిత్రీకరణ ఆపేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. హీరోయిన్‌ ఆండ్రియా ఇందులో బోల్డ్‌ పాత్రలో నటించనుందట. కథ డిమాండ్‌ చేయడంతో ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఆమె పారితోషికాన్ని కూడా పెంచినట్లు సమాచారం. గతంలో అమలాపాల్‌ కూడా ఆడై సినిమాకు నగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆండ్రియా కూడా పిశాచి 2 కోసం ఈ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చదవండి: భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top