భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి

World Blood Donor Day: Chiranajeevi  Along With His Wife Surekha Donates Blood - Sakshi

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతూ రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం World Blood Donor Day సందర్భంగా భార్య సురేఖతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ర​క్తదానం చేశారు.

ఈ సందర్భంగా 'రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప అదృష్టం' అని చిరు ట్వీట్‌ చేశారు. గతంలో కరోనా మొదటి వేవ్‌లోనూ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఆట సందీప్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపిన మెగాస్టార్‌ చిరంజీవి
గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top