Allu Arjun About Sukumar: Allu Arjun Talk About Sukumar & Pushpa Movie In 'Pushpa Success Event' - Sakshi
Sakshi News home page

Allu Arjun: ఆ సినిమా లేకపోతే నేను లేను: అల్లు అర్జున్‌

Dec 29 2021 8:11 AM | Updated on Dec 29 2021 8:50 AM

Allu Arjun Talk About Pushpa Movie And Sukumar - Sakshi

సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా థ్యాంక్స్‌ మీట్‌ కచ్చితంగా పెడతాను.

Allu Arjun About Sukumar: ‘పుష్ప’ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ‘ఆర్య’ చిత్రం ఒక మైలురాయి. సుకుమార్‌ లేకపోతే ‘ఆర్య’ లేదు.. ‘ఆర్య’ లేకపోతే నేను లేను. ఇప్పుడు నా కెరీర్‌ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్‌ అని గర్వంగా చెబుతాను’అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 17న విడుదలైంది.


(చదవండి: ఎమోషనల్‌ అయిన సుకుమార్‌.. చంద్రబోస్ కాళ్లకు మొక్కుతూ)

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘థ్యాంక్స్‌ మీట్‌’లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా థ్యాంక్స్‌ మీట్‌ కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టం ఒక్కటే ఉంటుంది. మా సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులు, సినీ అభిమానులకు థ్యాంక్స్‌’’ అన్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్‌ నాకు దేవుడు లాంటి వాడు. ముఖంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం’’ అన్నారు. ‘‘పుష్ప’ సినిమా ఇప్పటివరకు 285 కోట్లు వసూలు చేసింది. జనవరి 6 వరకు ప్రపంచవ్యాప్తంగా 325 కోట్లకుపైగానే కలెక్ట్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement