Allu Arjun Missed Vijay Devarakonda Arjun Reddy Movie Over Kiss Scenes, Deets Inside - Sakshi
Sakshi News home page

బన్నీ కాదన్న సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండ

Jun 9 2023 4:13 PM | Updated on Jun 9 2023 5:50 PM

Allu Arjun Missed Vijay Devarakonda Arjun Reddy Movie - Sakshi

విజయ్‌ దేవరకొండకు బ్లాక్‌ బస్టర్‌ మూవీని రిజక్ట్‌ చేసిన అ‍ల్లు అర్జున్‌

టాలీవుడ్‌లో ఒక్కోసారి చాలామంది హీరోలు వారి వద్దకు వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందులో కంటెంట్‌ నచ్చకనో, కథలో కొన్ని సన్నివేశాలు సెట్‌ కావనే సందేహమో తెలియదు..  ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి కూడా. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకే ఒక్క కారణం వల్ల సూపర్‌ హిట్‌ సినిమాను వదులుకున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: సైతాన్‌ ట్రైలర్‌లో పచ్చిబూతులు, అసభ్య సన్నివేశాలు.. డైరెక్టర్‌ ఏమన్నాడంటే?)

విజయ్‌ దేవరకొండకు లైఫ్‌ ఇచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'అర్జున్‌ రెడ్డి' కథను ముందుగా బన్నీకి చెప్పాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. కథ రాసుకునే సమయంలోనే బన్నీని ఫిక్స్‌ చేసుకున్నాడట. అయితే,  ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా  కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టాడట. దీంతో వెంటనే అల్లు అర్జున్  పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని  ఈ సినిమాకు నో చెప్పేశాడని సమాచారం. తర్వాత శర్వానంద్ దగ్గరికి సందీప్‌ రెడ్డి వెళ్తే.. అదే కారణంతో రిజక్ట్‌ చేశాడట. చివరిగా విజయ్ దేవరకొండ ఓకే చెప్పడం ఆ తర్వాత భారీ హిట్ కొట్టడమే కాకుండా తనకు ఆ సినిమా విపరీతమైన ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది.

(ఇదీ చదవండి:  ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement