18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్‌స్టోరీ కాదు..: అల్లు అరవింద్‌ | Allu Aravind Launched Yedurangula Vaana Song From Nikhil 18 Pages Movie | Sakshi
Sakshi News home page

Allu Aravind: 18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్‌స్టోరీ కాదు..: అల్లు అరవింద్‌

Published Sun, Dec 11 2022 6:25 PM | Last Updated on Sun, Dec 11 2022 6:25 PM

Allu Aravind Launched Yedurangula Vaana Song From Nikhil 18 Pages Movie - Sakshi

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు.  సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన..  రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. 

ఈ సాంగ్‌ రిలీజ్ చేసిన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా.  మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్‌స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా  ఒక సాధారణ మైన లవ్‌స్టోరీ కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ  మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్‌ చాలా డెడికేటెడ్‌గా వర్క్‌ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్‌గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement