ఆ ‍ప్రశ్న అడగడంతో ఐష్‌కు కోపమొచ్చింది! | Aishwarya Rai Once Loses Her Cool in Front of Media | Sakshi
Sakshi News home page

ఏమన్నారు? వీడియో చూపించండి, తర్వాతే మాట్లాడదామని వాదించిన ఐష్‌

Jun 27 2024 4:02 PM | Updated on Jun 27 2024 5:12 PM

Aishwarya Rai Once Loses Her Cool in Front of Media

ఐశ్వర్య రాయ్‌.. అప్పట్లో సినిమా ఇండస్ట్రీనే షేక్‌ చేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పొన్నియన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాల్లో మాత్రం తళుక్కుమని మెరిసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. కెరీర్‌ తారాస్థాయిలో ఉన్న సమయంలో ఇంగ్లీష్‌లోనూ సినిమాలు చేసింది. 

ఇటు బాలీవుడ్‌, అటు హాలీవుడ్‌ను ఏకకాలంలో హ్యాండిల్‌ చేసింది. అయితే ఐష్‌.. హాలీవుడ్‌కు షిఫ్ట్‌ కానుందంటూ కొన్నేళ్ల క్రితం ఓ వార్త వైరల్‌గా మారింది. దీని గురించి హీరోయిన్‌ను ప్రశ్నించగా ఆమె మండిపడింది. ఏమంటున్నారు? నేనలా చెప్పానా? ఏ ఇంటర్వ్యూలో అన్నానో చెప్పండి. ముందు ఆ వీడియో చూపించిన తర్వాతే మాట్లాడదాం.. అని ఫైర్‌ అయింది.

మీరు ప్రశ్నలు అడగండి.. కాదనను.. కానీ ఆల్‌రెడీ నేను ఏదో చెప్పేసినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు. తమిళ, బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్‌ చిత్రాల్లోనూ వర్క్‌ చేస్తున్నాను. అక్కడ పని చేస్తున్నాను కదా అని హాలీవుడ్‌కు వెళ్లిపోతాననుకోవడం కరెక్ట్‌ కాదు అని ఆగ్రహించింది. ఐశ్వర్య గతంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరలవుతున్నాయి.

చదవండి: పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement